Thursday, April 24, 2008
పెళ్ళి గోల
ఏంట్రా అబ్బాయ్? ఇంట్లో అంతా పెళ్ళి చేసుకోమని పోరెడుతున్నారు, తప్పించుకోవడమెలా అంటావా? తిక్క సన్నాసీ! చాలా తేలికరా! అమ్మాయికి హరికథలు చెప్పడం రావాలనో పూతరేకులు చెయ్యడం రావాలనో condition పెడ్తే సరి. వెతికేసరికి జేజమ్మలు దిగొస్తారు. పోనీ ఏదోటి చేసి పెళ్ళిచూపుల్దాకా లాక్కెళ్ళారనుకో, అక్కడ అమ్మాయిని కనిష్కుడు ఎక్కడ పుట్టాడు, రెండవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది లాంటి ప్రశ్నలడుగు. దిమ్మతిరిగిపోతుంది. ఒకవేళ మీవాళ్ళు కుట్రపన్ని question paper లీక్ చేసేసారనుకో, చివరగా నీకు హార్మోనియం అంటే ప్రాణమని రోజూ ఓ మూడు గంటలు practice చెయ్యందే నిద్రపట్టదని చెప్పి ఓ సారి వాయించు. దెబ్బకు పిల్లనిచ్చేవాళ్ళు మీ వీధివైపుకూడా రారు! ...............................
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment