Thursday, April 24, 2008

డెడ్‌లాక్

maa friend్ రెండో యేడనుకుంటా! Computer Architecture క్లాసో, Computer Networks క్లాసో సరిగ్గా గుర్తులేదు. ఎప్పట్లాగే మాధవి కుమారి మేడం ఠంచనుగా పదిన్నరకే దిగిపోయింది. ఒక్క నిమిషం లేటు రాదు, ఒక్క నిమిషం ముందు వదలదు. గంటన్నర క్లాసూ తీసుకోవాల్సిందే! ఆ రోజు రాగానే సడన్‌గా What is the greatest invention of man? అని అడిగింది. అప్పుడే నా ఎడమ కన్ను అదిరింది. అంటే ఈ రోజు ఏదో మూడిందన్నమాటే! సరే! ఇప్పుడు ఎవరో ఒకరు answer చెయ్యాలిగా. మాకా శ్రమ లేకుండా ముందు బెంచీల్లో అమ్మాయిలు చెప్పేసారు కంప్యూటర్ అని! any others అంది మేడం. No response. చివరకు మేడం విజయదరహాసంతో చెప్పింది Fire అని. ఇలాంటి షాకులు కొత్తేంకాదు కాబట్టి ధైర్యంగానే ఉన్నాం. తర్వాత అసలు క్లాసు స్టార్టయ్యింది. ఆదిమానవులు మంట లేనప్పుడు ఎలా వుండేవారు, మంటను ఎలా కనుక్కున్నారు, తర్వాత ఎలా డెవలప్ అయ్యారు అన్నీ వివరంగా అరగంటపాటు చెప్పింది.

తర్వాత ఎలా తీసుకొచ్చిందోగానీ మంటను తీసుకెళ్ళి డెడ్‌లాక్‌కు ముడి పెట్టింది. ఆ పరిణామక్రమం అంతా చెప్తే జనాలు రాళ్ళిచ్చుకొడ్తారు. సరే మొత్తానికి అరగంట తర్వాత తెలిసింది ఈ రోజు టాపిక్ డెడ్‌లాక్ అని! ఆ మిగిలిన గంటసేపూ డెడ్‌లాక్ గురించి సోదాహరణంగా వివరించేసరికి మా అందరిలో జవసత్త్వాలు నశించిపోయి పీనుగుల్లా అయిపోయాం. ఎన్ని examples చెప్పిందనుకున్నారు? ఒక సన్న బ్రిడ్జిమీదకు రెండు పెద్ద లారీలు ఎదురెదురుగా వస్తే ఏమవుతుంది? సిగ్నల్ లేని చౌరస్తాకు నాలుగు కార్లు ఒకేసారి వస్తే ఏమవుతుంది? ఇలా ఇంకా బోల్డు "కొత్త కొత్త" విషయాలు చెప్పి మా బుర్రల్లోని గుజ్జంతా లాగేసింది. అసలు ఇంత simple topicని అంతగా చీల్చి
చండాడొచ్చని అసలు అనుకోలేదు సుమండీ! ఎలాగో గంటన్నర అయ్యింది కాబట్టి బతికిపోయాం గానీ ఆ ప్రవాహానికి అంతెక్కడ?

కొద్ది రోజుల తర్వాత ప్రవీణ్ అమెరికాలో Daylight Savings గురించి చెప్పాడు. అది వినగానే మనకు ఆ కాన్సెప్ట్ లేనందుకు హమ్మయ్య అనుకున్నాను. లేకపోతే మాధవి కుమారి క్లాసులో గంట వెనక్కు తిప్పుకోండి అంటే మా గతేం కానూ?

No comments: